19-07-2025 05:35:49 PM
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుసింది. కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చంపాపేట్, సరూర్ నగర్, ఉప్పల్, ముషీరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, బోరబండ, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, కావాడిగూడ, బోలక్ పూర్, అంబర్ పేట, కాచిగూడ, బర్కత్ పూరా, యూసఫ్ గూడలో వర్షం పడింది.
అలాగే సికింద్రాబాద్ లోని తిరుమలగిరి, బొల్లారం, బోయిన్ పల్లి, మారేడుపల్లి, తార్నాక, చిలకలగూడ, బేగంపేట, అల్వాల్, లాలాపేట్, హబ్సిగూడ నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతుంది. ట్రాఫిక్ నెమ్మదిగా ఉందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ హెచ్చరిక..
వర్షాల సమయంలో భద్రతను నిర్ధారించడానికి, హైదరాబాద్ నివాసితులకు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నీటితో నిండిన ప్రాంతాలలో అనవసర ప్రయాణాలను నివారించాలని జీహెచ్ఎంసీ సూచించింది. నిర్మాణ ప్రదేశాలు, తెరిచి ఉన్న కాలువలు, మ్యాన్‌హోళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. చెట్ల కింద లేదా బలహీనమైన నిర్మాణాల కింద వాహనాలను పార్క్ చేయోద్దని, అత్యవసర పరిస్థితుల కోసం ప్రజలు సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. నివాసితులు వర్షం సంబంధిత సమస్యలను హైడ్రా(HYDRAA) కంట్రోల్ రూమ్ ద్వారా 040-29555500 లేదా 9000113667 కు డయల్ చేయడం ద్వారా లేదా ఐసీసీసీ(ICCC) కంట్రోల్ రూమ్ 8712674000 ద్వారా నివేదించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.