29-08-2025 04:06:31 AM
కామారెడ్డి, ఆగస్ట్ 28 (విజయ క్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న కుంభ వర్షం కామారెడ్డి జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది. కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో సమీపంలో రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న 9 మంది కూలీ లు నీటి ప్రవాహంలో చిక్కుకొని ట్యాంకర్ పై నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్ పోలీస్ బృందాలు చేరుకొని నీటిలో చిక్కుకున్న 9 మందిని రక్షించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నీటిలో చిక్కుకున్న వారిని దగ్గరుండి ఒడ్డుకు చేర్చారు.
లింగంపేట మండలం ఎల్లారం వద్ద కల్వర్ట్ కృంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి, ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ కౌండిన్య ఎంక్లేవ్ లో ఉన్న వారి చుట్టూ వరదనీరు చేరడంతో వారిని స్థానిక పోలీసులు తాళ్ల సహయంతో బయటకు తెచ్చారు. బిక్కు బిక్కు మంటూ ప్రజలు గడిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం చౌరస్తా సమీపంలో విద్యానగర్, నిజాంసాగర్ రోడ్ లో జీవధాన్ స్కూల్ వరకు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజ లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురవడంతో కామారెడ్డి పెద్ద చెరువు భారీగా ప్రవహించడంతో కామారెడ్డి వాగు ఉద్రుతంగా ప్రవహించింది. దీంతో జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ పాత జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి, రాకపోకలు నిలిచిపోయాయి.
కామారెడ్డి జిల్లా దోమకొండ ఎడ్ల కట్ట వాగు పొంగిపొర్లడంతో సంగమేశ్వర్ వెళ్లే ఇద్దరు కారులో ప్రవహానికి కొట్టుకపోయారు. స్థానికులు చూసి జెసిబి సాయంతో వారిని గడ్డకు చేర్చారు. ఎల్లారెడ్డి మండలంలోని నాగిరెడ్డిపేట్ గోపాల్పేట్ మధ్యలో వాగులు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలలో భారీ వర్షం కురవడంతో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.
భిక్కనూర్ రామేశ్వర్ పల్లి శివారులో రైల్వే ట్రాక్ కింది నుంచి వరద నీరు ప్రవహించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తలమడ్ల, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో కరీంనగర్ కాచిగూడ రైలు నిలిపివేశారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో కామారెడ్డి జిల్లా కేంద్రం జలదిగ్బంధం అయింది. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి అప్రమత్తం చేశారు.
రాజంపేట మండలంలోని కొండాపూర్ తండా, తో పాటు పలు తండాలు జలదిగ్బంధమయ్యాయి. లింగంపేట మండలంలోని కన్నాపూర్ పోల్కంపేట చెరువు పెను ప్రమాదంలో పడింది. పలు చెరువులు, కుంటలు ప్రమాద స్థాయికి చేరాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, కళ్యాణి ప్రాజెక్ట్ లలోకి వరద నీరు భారీగా చేరడంతో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.
జిల్లా కలెక్టర్ అసిస్ సంగువన్ ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షిస్తూ పరిస్థితులపై ఆరా తీశారు. కామారెడ్డిలో గతంలో ఎప్పుడు కురువని విధంగా వర్షం 14 గంటల్లో 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. కంట్రోల్ రూమ్ కు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సేవలందిస్తున్నారు.
వరద ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జయ రాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ సెట్ కార్ పరిశీలించారు. బాధితుల ను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేసి ఆదుకుంటామన్నారు. దెబ్బతిన్న రోడ్లను, మరమ్మతులు చేపడతామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అధికారి హనుమంతు గాంధీ, జిల్లా కలెక్టర్ అసిస్ సంగువాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోడ్లపై నీటి ప్రవాహం పరిస్థితి సమీక్షిస్తున్న జిల్లా సీపీసీ సాయి చైతన్య మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్
నిజామాబాద్ ఆగస్టు 28: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరం నడిబొడ్డున గల జిల్లా కోర్టు చౌరస్తా ప్రాంతం నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట తోపాటు తట్టు ప్రాంతాలన్నీ జలదిగ్ బంధానికి గురైయ్యాయి . జిల్లా పోలీస్ శాఖ కమిషనర్ సిపి సాయి చైతన్య మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ముంపు ప్రాంతాలకు వెళ్లి రహదారులు డ్రైన్లను ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ, పట్టణ ఎస్‌హెచ్ ఓ
కామారెడ్డి, ఆగస్టు 23 (విజయ క్రాంతి), ముంచెత్తిన నీటి వానలో ఎవరు వచ్చి ఆదుకుంటారో అని ఎదురుచూసిన ప్రజల కు పోలీసులు అండగా నిలిచారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న వారికి కామారెడ్డి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణి ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఉండి పనులు చేస్తున్న 8 మంది కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ వాటర్ ట్యాంక్ పై ఏక్కి తమను ఎవరు కాపాడుతా రోనని ఎదురుచూసిన కార్మికులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర రేస్ క్యూ ఆపరేషన్ ఎన్ డి ఆర్ ఎస్ బలగాలతో నిర్వహించారు.
కళ్యాణి వాగు ప్రాజెక్టు వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది మంది కార్మికుల్లో మొదటిసారి ఐదుగురిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురిని బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడారు. దీంతో తమ ప్రాణాలు పోతాయని ఆవేదనతో ఉన్న తమకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడిన పోలీసులను మర్చిపోలేని కార్మికులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఎస్ ఆర్ కాలనీలో వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బిక్కు బిక్కు మంటూ వరద నీటిలో చిక్కుకొని ఎదురుచూసిన కాలనీవాసులకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చూపిన రెస్క్యూ ఆపరేషన్ కు స్పిరిట్ పొందిన కామారెడ్డి పట్టణ సిఐ నరహరి పోలీస్ సిబ్బందితో వెళ్లి తాళ్ల సహాయముతో జి ఎస్ ఆర్ కాలనీలో చిక్కుకున్న 150 మంది కాలనివాసులను వృద్ధులు, మహిళలు, వికలాంగులను తమ ఒంటిపై కూర్చుండబెట్టుకొని రెస్క్యూ తో బయటకు తీసుకువచ్చారు.
ఇదే కాలనీ పక్కన ఉన్న హౌసింగ్ బోర్డ్ లోని కౌండిన్య అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని సైతం అదే స్పీడ్ గా పట్టణ సీఐ ఆధ్వర్యంలో మరో 50 మందిని బయటకు తీసుకువచ్చారు. ఎంతో ఆందోళనతో ఉన్న కాలనీవాసుల కు పోలీసులు భరోసా కల్పించి రాత్రి అయినా కూడా లేక చేయకుండా బుధవారం రాత్రి వారిని వారి ఇండ్ల నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షితంగా కాపాడారు.
వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లి మండలం వాడి, నడిమి తండా, బీరప్ప తండాలను గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సీపీ సాయి చైతన్య తో కలిసి ఆయన పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరద నీటి తాకిడికి గురైన ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.
ముంపు కు గురై జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలను బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన హొన్నాజీపేట పాఠ శాల ను ఎమ్మెల్యే ఎమ్మెల్యే సందర్శించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు కల్పించారు. గ్రామాల్లో విద్యుత్ తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాల ని జిల్లా యంత్రాంగానికి ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ముందు గా రామడుగు, లోలం గ్రామాల వద్ద లోలెవెల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సిపీలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రాకపోకలను నిలిపి వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యే తో పాటు పరిస్థితిని సమీక్షించారు ఉన్నారు.
అకాల వర్షానికి ప్రజలు ఆందోళన చెందవద్దు
ఎల్లారెడ్డి ఆగస్టు 28 (విజయక్రాంతి): కుండబోతగా కురిసిన వర్షానికి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని,రాజంపేట మండలం కొండాపూర్, నడిమి తండా, ఎల్లాపూర్ తండా, పళ్ళు గుట్ట తండా గ్రామంలో, ఎమ్మెల్యే మదన్ మోహన్, నేరుగా పర్యటించారు. భారీ వర్షాలు వరదల కారణంగా ద్వాంసమైన రహదారులు, వంతెనలు, పంట పొలాలు, ఇండ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నష్టం జరిగిన,వాటి వివరాలను క్షేత్ర స్థాయిలో,సర్వే నిర్వహించి అంచనా వేసి నివేదికను అందించాలని, అధికారులకు తెలిపారు.
అనంతరం రెండురోజులుగా,అతల కుతలమైన, ఆ గ్రామ ప్రజలకు భాదితులకు బ్రేడ్స్ పళ్ళు గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్ నేరుగా పంపిణి ,చేశారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి ఆగస్టు 28 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను గురువారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిశీలించారు. పట్టణంలోని జి ఆర్ కాలనీ గల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని ఓదార్చారు ఇంటింటికి వెళ్లి వరద తీవ్రతను జరిగిన నష్టాన్ని బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. రామారెడ్డి రోడ్డులో గల టీచర్ కాలనీలో పర్యటించారు.
దేవునిపల్లి లో గల నిజాంసాగర్ రోడ్డులో దంసమైన రోడ్లను ముంపుకి గురైన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వెంట పార్టీ నాయకులు ,పట్టణ పార్టీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి ,కుంభాల రవి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్, స్వామి కృష్ణాజి రావు ,పాత హనుమాన్లు, ఫ్లోర్ లీడర్ ఆఫీస్ యువజన విభాగం అధ్యక్షుడు భాను తో పాటుపలూరు ఉన్నారు.
బాన్సువాడలో పరిశీలించిన ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు...
బాన్సువాడ ఆగస్ట్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పలు ప్రాంతాలను స్వయంగా ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఇంజనీర్లు తో పరిశీలించారు. పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ సమీపం, హోండా షోరూమ్ పరిసరాలు పరిశీలించారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే పంపింగ్ మిషన్లు, డ్రైనేజీ మార్గాలను ఉపయోగించి నీటిని తొలగించాలనీ ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి అని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం సాయి కృపా నగర్లో పర్యటించారు. అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు రహదారులు దెబ్బతినడం, కాలువలు మూసుకుపోవడం, వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం వంటి సమస్యలను ప్రజలు వివరించారు. కాసుల బాలరాజు తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం కల్కి చెరువు కట్టను పరిశీలింరు.
కొట్టుకుపోయిన చిన్నపూల్ వంతెన
నిజాంసాగర్ ఆగష్టు 28( విజయ క్రాంతి) కుండపోత వర్షాలతో ఎగువ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు 27 వర ద గేట్ల ద్వారా 2.20 లక్షల క్యూసె క్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. కాగా.. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువ భాగంలో గల చిన్న పూల్ వంతెన కొట్టుకుపోయింది. నిజాంసాగర్ నుంచి నవోదయ పాఠ శాలకు వెళ్లే వంతెన కొట్టుకుపోవ డంతో నవోదయ, ఆదర్శ పాఠ శాలల విద్యార్థులు ఆందోళన చెందు తున్నారు. నవోదయలో సుమారు 500 మంది విద్యార్థులు, ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఉన్న సుమారు 90 మంది విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతు న్నారు. రెండు పాఠశాలల చుట్టూ వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆందోళన చెందుతు న్నారు.
మంజీరా బ్రిడ్జి వద్ద ..
బాన్సువాడ ఆగస్టు 28 (విజయ క్రాంతి) ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 24 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదలడంతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల శివారులోని మంజీరా బ్రిడ్జి లెవెల్ లో వరద నీరు పారడంతో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పరిశీలించారు.బాన్సువాడ పట్టణంలో కురుస్తున్న అకాల వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు, కల్కి చెరువు ను పరిశీలించి వరద పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు ఎజాజ్,రవీందర్, గోపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,శ్రీధర్,శ్రీనివాస్, గంగాధర్ ఉన్నారు.