calender_icon.png 18 August, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలుగు పోస్తున్న యావపూర్ పెద్ద చెరువు

18-08-2025 05:38:38 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మండలం యావపూర్ పెద్ద చెరువు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిన్న సాయంత్రం భారీ వర్షం కురవడంతో చెరువు పూసి పారడంతో అలుగు పోసింది. యావపూర్ గ్రామ వాసి కుతాడి నరసింహులు వీరి మిత్ర బృందం కలసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తడి వద్ద గంగమ్మకు పసుపు కుంకుమార్చన చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా కుతాడి నరసింహులు, గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామన్ని పాడి పంటలను పశువులను చల్లగా చూడాలని ఆ గంగమ్మ దీవెనలు సదాకాలం మాపై ఉండాలని కోరుకున్నారు.