ఓటు మన చేతిలో వజ్రాయుధం
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ ‘ప్రజాస్వామ్యం’ అంటే ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకొనే విధానం’ అన్నారు. ప్రజాస్వా మ్యం అనేది ఒక రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ. ప్రజలు లేదా ఓట ర్లు వేసే ఓటువల్ల ఆ ప్రభుత్వాన్ని నిర్ణయి స్తారు. 1950 జనవరి 25న ‘భారత ఎన్నిక ల సంఘం’ ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి ‘జాతీయ ఓటర్ల దినో త్సవాన్ని’ 2011 జనవరి 25వ తేదీ నుండి నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన యువ తకు కొత్తగా ఓటుహక్కు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ తెలియ చేయ డం, ఓటు ప్రాముఖ్యాన్ని చెప్పేలా ఎన్నిక ల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 2011 జనవరి 25న అప్ప టి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్య క్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమో దం లభించింది.
పాలకులను ఎన్నుకోవడానికే..
ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరి త్రనే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిం డిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటుహక్కును కల్పి స్తున్నది. ఓట్లు వేసిన వారిని ‘ఓటర్లు’ అని పిలుస్తారు. దేశాభివృద్ధి కోసం నాయ కులను ఎన్నుకోవటానికి ఓటు అనేది ఒక వజ్రాయుధం. భారత పౌరులకు రాజ్యాం గం కల్పించిన హక్కు. పాలకులను ఎన్ను కోవడమే ఓటు ముఖ్యోద్దేశం. అయితే, ఓటుహక్కును సుమారు 20 నుంచి 30 శాతం ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ సద్విని యోగం చేసుకోవటం లేదు. ప్రధాన కార ణం ఓటు ప్రాముఖ్యం, విలువ తెలియక పోవడం, సరయిన అవగాహన లేకపో వడం.
నూరు శాతం పోలింగ్ సాధించే దిశగా ఎన్నికల సంఘం ఓటు ప్రాముఖ్యం, నమోదుపై ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్ర మం ద్వారా ప్రజలను ఓటు వేయడం వైపు చైతన్య పరచడం, యువతను ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉన్నా యి. కనుకనే, మంచి పాలకులను ఎన్ను కోవటానికి ఓటు అనేది వారికి తిరుగు లేని అస్త్రం వలె పనిచేస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధా రపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచు కుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుద్వారా ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం.
స్వతంత్రంగా విధుల నిర్వహణ
ప్రజాస్వామ్యం ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఎన్నికల సంఘం’ కీలకపాత్ర పోషిస్తున్న ది. ఏ రాజకీయ పార్టీకీ తలవంచక స్వతం త్రంగా తన విధులను నిర్వర్తిస్తుంది. కేంద్ర స్థాయిలో ‘భారత ఎన్నికల సంఘం’, రాష్ట్రాల స్థాయిలో ‘రాష్ట్ర ఎన్నికల సంఘా లు’ విధులను సమర్థంగా నిర్వహిస్తు న్నాయి. ప్రజాస్వామ్యం మనుగడ ఓటరు పై ఆధారపడి ఉన్నందున ఓటరుకు ప్రాధాన్యం పెరిగింది. రాజకీయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో యువతను భాగస్వా మ్యులను చేసే దిశగా ఓటు ప్రాముఖ్యాన్ని వారికి వివరించేందు కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధా లుగా ప్రచారం చేస్తున్నాయి. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తిం పుకార్డులు అందిస్తుంది. ఓటు ప్రాము ఖ్యం, కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ ‘ఎన్నికల సంఘం’ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది.
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుతోనే వార్డు సభ్యుల నుంచి రాష్ట్రపతి వరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. భార తదేశంలో 1952 నుండి సార్వత్రిక వయో జన ఓటుహక్కు వినియోగంలోకి వచ్చిం ది. ఇంతకు ముందు బ్యాలెట్ పేపర్‌ద్వారా ఓటు వేసేవారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నిక ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీ ఎం) ద్వారా ఓటుహక్కును వినియో గిస్తు న్నారు. అంతేకాక మరింత పారద ర్శకంగా ఉండడం కోసం వీవీప్యాట్‌లను కూడా ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు నిండిన యువ త కొత్తగా ఓటుహక్కు పొందాలంటే దర ఖాస్తు చేసుకోవాలి. 15 రోజుల్లోగా ఆన్ లైన్‌లో పొందుపర్చిన వివరాలను పరిశీ లించిన తర్వాత రెవెన్యూ అధికారులు ఓటరు కార్డును లబ్ధిదారులకు పోస్ట్‌ద్వారా అందజేస్తారు. లేదా మీ సేవా కేంద్రాల నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రజలే మెరుగు
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకో వాలి. ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే. దేశంలో యువత బలం ఎక్కువగా ఉంది. ఈ దృష్ట్యా యువ త ఓటు నమోదు చేసుకోవటంతోపాటు దానిని విధిగా వినియోగించాలి. మనది విస్తృత ప్రజాస్వామిక దేశం. రాజ్యాంగం కూడా ఎంతో బృహత్తరమైంది. అనేక మతాలు, జాతులు, భాషలు, కులాల ప్రజానీకంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలు పుకొంటున్న గొప్ప దేశంగా ప్రపంచ స్థాయిలో మన్ననలను అందుకొంటున్న ది. ఓటుహక్కును ప్రతి ఒక్కరూ తప్పని సరిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది.
ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వే చ్ఛకు అవకాశం వుంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధిక శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటు న్నారని గత ఎన్నికల శాతాన్నిబట్టి తెలు స్త్తోంది. పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటుహక్కును వినియోగించుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అందువల్ల, ఈ వర్గాలు ఓటుహక్కును వినియోగిం చుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవస రం ఉంది. మన దేశంలో ఓటు వేయని వారు ఇప్పటికీ దాదాపు 30 శాతం ప్రజ లు ఉన్నారు. అది సున్నాకు రావాల్సిన అవసరం ఉందన్న సంగతిని గుర్తించవ లసిన బాధ్యత మనందరిది. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకంటే శక్తివంత మైన పాత్ర శాసనాలు చేసే పార్లమెంట్, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది రాజకీ య నేతలే. అలాంటి నేతలను ఎన్నుకొనేది ఓటర్లే. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాం టి భేదభావాలు లేకుండా ఓటుహక్కును కల్పించింది మన రాజ్యాంగం.
రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం లక్ష్యం కూడా అదేనని, రాజకీ య ప్రజాస్వామ్యం సామాన్యులకు అంద కపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని 1949 నవంబర్ 26న భార త రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమ ర్పిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చ రించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక బలమైన ఆయుధం. దానిని సక్రమం గా ఉపయోగిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజ స్వామ్యంపై విశ్వాసంతో, దేశ సంప్రదా యాలు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడ తామని, జాతి, మతం, కుల, వర్గ, భాషా భేదాలు లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా నీతి, నిజాయితీగా ప్రతి ఎన్నిక ల్లో నిర్భయంగా ఓటుహక్కును వినియో గించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని వాగ్దానం చేస్తూ ఓటరుగా నమోదు కావా లి. అలా బాధ్యతాయుతంగా ఓటుహక్కు ను వినియోగించుకోవాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని మరింత మెరుగుపరచుకున్న వాళ్లమవుతాం.
వ్యాసకర్త : గడప రఘుపతిరావు, సెల్: 9963499282






