25 July, 2026 | 7:33 AM

హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్

27-06-2024 07:49 PM

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం జోరుగా వాన కురిసింది. వర్షం కారణంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. తాజాగా హైటెక్ సిటీలోని ఐటి కంపెపనీల ఉద్యోగులంతా  ఒక్కసారిగా ఆఫీసుల నుంచి బయటికి వచ్చారు. దీంతో ఐకియా మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి నెమ్మదిగా కదులుతున్నాయి. ఇందకు సంబంధించిన విడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐటి ఉద్యోగులు దీన్ని గమనించి తమ ప్రయాణ వేళల్లో మార్పులు చేసుకోవాలని కోరారు.