ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అద్వానీ
27-06-2024 06:18 PM
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ గురువారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. గత కొంతకాలంగా యూరాలజీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలోని పాత ప్రైవేట్ వార్డులో చేర్పించారు.
యూరాలజీ ప్రొఫెసర్ డా. అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో అద్వానీ చికిత్స పొందుకున్నారు. ఇవాళ అద్వానీ మెడికల్ బులెటిన్ ను విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు వృద్దాప్య సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రి అడ్మిట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతానికి అద్వానీకి ఎలాంటి సమస్య లేదని తెలిపారు.






