ఎస్‌బీఐ క్లర్క్ తుది ఫలితాలు విడుదల
27-06-2024 08:19 PM
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ని ఉపయోగించి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్‌బీఐ పీఒ ప్రిలిమ్స్ పరీక్షను జనవరిలో నిర్వహించగా.. ఫిబ్రవరి 25, మార్చి 4, జూన్ 9 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్టు మరియు సేల్స్) పోస్టులు భర్తీ చేయడానికి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ 3515, ఓబీసీ 1919, ఈడబ్ల్యూఎస్ 817, ఎస్సీ 1284, ఎస్టీ 784 పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి రూల్ నంబర్లతో పీడీఎఫ్ ను విడుదల చేశారు.






