11-11-2025 12:38:03 AM
తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మ న్, ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కు మార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ, ఛలో ఢిల్లీ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కర్ణాటక ఇంచార్జ్‌గా అజయ్‌ను నియమించారు. ఈ సమావేశంలో బీసీ సం ఘం నేతలు నీల వెంకటేష్, భీమ్ రాజ్, రాజేందర్, అనంతయ్య, సతీష్, అంజి గౌడ్, మోదీ రాందేవ్, తదితరులు పాల్గొన్నారు.