11-11-2025 12:36:53 AM
మొయినాబాద్, నవంబర్10 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకుండ క్రిమినల్ కేసులు నమో చేస్తామని తాసీల్దార్ గౌతంకుమార్ హెచ్చరించారు. మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 33లో సుమారుగా 25 గుంటల భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తాసీల్దార్ తమ సిబ్బందితో కలిసి కబ్జా జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
విచారణ చేపట్టగా కొందరూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన సొంత భూమిలో కలుపుకుని అందులో నుంచి ఫైపు లైన్లు వేసినట్లు గుర్తించి పనులను నిలిపివేశారు. విచారణ అనంతరం ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడానికి సైతం వెనుకాడేది లేదని, ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆయనతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, సర్వేయర్ జలజ, జీపీఓ రాజేశ్వర్, సిబ్బంది భరత్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.