11-11-2025 12:38:15 AM
డాక్టర్ కేశవన్, ప్రిన్సిపల్, అధ్యాపకులు
మొయినాబాద్, నవంబర్10 (విజయక్రాంతి ): మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో గల కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆరు రోజుల పాటు ఏఐసీటీఈ ఆధ్వర్యంలో నిర్వహించే అటల్ ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సోమవారం అట్టహాపంగా ప్రారంభంఅ అయ్యింది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం వారు అధ్యాపకులకు, పారిశ్రామికి నిపుణులకు పరిశోధన స్కాలర్స్కు అడ్వాన్సస్ ఇన్ 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ ఫర్ మోడరన్ మ్యానుఫ్యాక్షరింగ్ అనే అంశంపై ఏఐఐఈటీఈ ఆధ్వర్యంలో అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్‌ఎపీ) నిర్వహించారు.
ఆరు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహారం, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి 79 మంది ఫ్యాకల్టీలు దరఖాస్తులు చేసుకున్నారు.అటల్ మార్గదర్శకాల ప్రకారం 60 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన 60 మంది ఆరు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. కార్యక్రమంలో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ కె కేశవన్ పాల్గొన్నారు.మ్యానిఫ్యాక్షరింగ్ టెక్నాలజీస్, అకాడమిక్ రీసెర్చ్లో పీహెచ్‌ఎ అభ్యాసంలో ఎంత ముఖ్యమో వివరించారు.
ఏఐసీటీఈ ఇలాంటి ఎఫ్‌ఎపీల ద్వారా దేశవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తున్నందుకు ఆయన ప్రశంసించారు. త్రీడీ ఫ్రింటింగ్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసత్యనారాయణరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి బాలోజి,అకాడమిక్ డీన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ నర్సయ్య,ఎఫ్‌ఎపీ సహా-సమన్వయకర్త కె కల్పన, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.