29 August, 2026 | 4:31 AM

రాఖీ సందర్భంగా హెల్మెట్ల పంపిణీ

29-08-2026 12:00 AM

నేరేడుచర్ల, ఆగస్టు 28: నేరేడుచర్లలో 10 మంది ద్విచక్ర వాహనదారులకు చిన్న పిల్లలతో గులాబీ పువ్వు ఇచ్చి స్వీట్ తినిపించి రాఖి కట్టి హెల్మెట్ లను బహుమతిగా రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా స్థానిక ఎస్.ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతిరోజూ 400 మందికి పైగా రైడర్లు రోడ్డపై మరణిస్తున్నారని, రోడ్లు భద్రతను ప్రోత్సహించడానికి రాఖి సంప్రదాయాన్ని తిరిగి వ్రాయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూహెల్మెట్ లేని ప్రయాణం ప్రాణంతో ఆటలాడడమే అని, నా అన్న, నా తమ్ముడు సురక్షితంగా ఉంటేనే రాఖీకి అర్థం ఉంటుందని సాటి చెప్పిన పిల్లలకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో దూళిపాళ ధనుంజయ నాయుడు, పెరుమాళ్ళ సతీష్ కుమార్, రామ్ సైదులు, తకెళ్ళ నాగార్జున, షేక్ నాగుల్ మీరా, చిలకరాజు శ్రీనివాస, అరె శ్రీకాంత్, రమేష్, నాగరాజు, కర్రీ సతీష్ రెడ్డి,కొప్పు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.