విషాదబాద్‌గా హైదరాబాద్
- భాగ్యనగర అభివృద్ధిపై గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం
- మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలివాలి
- అప్పుడే కేంద్ర పథకాల అమలు మరింత పారదర్శకం
- రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- తార్నాక డివిజన్‌లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురు విద్యావంతులు, స్థానికులు
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి): హైదరాబాద్‌ను ‘విశ్వనగరం’ చేస్తామని గొప్పలు చెప్పి గత బీఆర్‌ఎస్, ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కలిసి మహానగరాన్ని ‘విషాదబాద్‌గా’గా, ‘విషాద మహానగరంగా మార్చేశాయని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే కేంద్ర పథకాల అమలు మరింత పారదర్శ కంగా ఉంటుందని స్పష్టం చేశా రు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో సరైన మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, సమస్యలతో నగర ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ప డుతూ అల్లాడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో భాగ్యనగర అభివృద్ధి పూర్తిగా కుంటుప డిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నా యకత్వంలో అందుతున్న సుపరిపాలన, అభి వృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సమాజంలోని విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున బీజే పీ వైపు చూస్తున్నా రని తెలిపారు.
తార్నాక డివిజన్‌లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావం తులు, స్థానిక ప్రముఖులు శుక్రవారం బీజేపీలో చేరారు. వారికి ఎన్ రాంచందర్‌రావు కాషాయ కం డువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. హైదరా బాద్ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని నగర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే మూడు మున్సిపల్ కా ర్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలి స్తే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అత్యంత పారదర్శకంగా నేరుగా ప్ర జల వద్దకు చేరుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజే పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేపాల్ వరద విపత్తు తీవ్ర విచారకరం
నేపాల్ వరద విపత్తుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్‌లో ఆకస్మిక వరదల వల్ల చాలామంది ప్రాణా లు కోల్పోవడం, వందలాది మంది గల్లం తు కావడం తీవ్ర విచారకరమన్నారు. గల్లంతైన వారిలో 320 మంది భారతీయు లుండటం బాధాకరమన్నారు.
వారి ఆచూ కీ కనుగొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలోనేపాల్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత ప్ర భుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. నేపాల్‌కు భారత ప్ర భు త్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని భరోసా ఇచ్చారు.






