04-07-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూలై 3 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో చదువు కొన సాగించలేని ఓ నిరుపేద విద్యార్థినికి జగిత్యా ల సత్యసాయి సేవా సంస్థ సభ్యులు చేయూతనందించారు. జగిత్యాలకు చెందిన మామి డాల చంద్రకళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడ పిల్లలను చదివించింది. ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించి ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న కూతురు వెన్నెల కాలేజ్ ఫీజు కట్టలేక చదు వు కొనసాగించలేని పరిస్థితి వచ్చింది.
దీంతో స్థానిక సత్య సాయి సేవ సమితి సభ్యులను సంప్రదించగా, వెన్నెల ఇంజనీరింగ్ చ దువు కొనసాగించేందుకు రూ. 40 వేలు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ బట్టు రా జేందర్, చిటుమల్ల లక్ష్మీనారాయణ , అర్వపెల్లి ఆనంద్, ఎన్నాకుల అశోక్, వంగల లక్ష్మీ నారాయణ, గుండ అర్చనలుపాల్గొన్నారు.