04-07-2025 01:59:25 PM
హైదరాబాద్: పాశమైలారం పేలుడు(Pashamylaram Explosion) ఘటన భయానక ఉదంతం అని కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. మృతదేహాలను కార్డ్ బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, ఘటనాస్థలంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని కేటీఆర్ విమర్శించారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) వలస కార్మికులను ఆదుకుందని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెప్పారని తెలిపారు. వలస కార్మికులకు ఉచితంగా రేషన్, రవాణా, వైద్య చికిత్స అందించామని పునరుద్ఘటించారు. ఎస్ఎల్ బీసీ ఘటనలో పరిహారం కోసం ఎనిమిది కుటుంబాలు వేచి చూస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. వలస కార్మికులంటే రేవంత్ రెడ్డికి అంత చులకనగా ఉందా? మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా గౌరవం ఇవ్వరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.