calender_icon.png 4 July, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో బాలబాలికల నేషనల్ ట్రయల్ సెలక్షన్స్

04-07-2025 02:03:18 PM

హుజురాబాద్:(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని రైల్వే గ్రౌండ్ లో జూనియర్ బాలికలు, బాలుర  నేషనల్ హాకీ సెలెక్షన్ ట్రయల్స్(National Hockey Selection Trials) ఆదివారం జూలై 6న నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ తిరునా హరి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రయల్స్‌ కోసం కరీంనగర్ జిల్లా హాకీ క్రీడాకారులు తమ పేర్లు జిల్లా ఇన్‌చార్జ్ సెక్రటరీ మహమ్మద్ తారీక్ అలీ వద్ద నమోదు చేసుకోవాలని  తెలిపారు.

ఈ సెలెక్షన్ ట్రయల్స్‌కు 01 జనవరి 2006 లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులు. ట్రయల్స్‌కు హాజరవ్వనున్న క్రీడాకారులు తప్పనిసరిగా హాకీ ఇండియా ఐడి కార్డు, ఆధార్ కార్డు, జన్మ ధృవీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావలసి ఉంటుంది.ఉదయం 8 గంటలకు ట్రయల్స్ ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ముందుగానే తమ హాజరు ఖరారు చేసుకోవాలని సూచించారు. సమాచారం కోసం సంప్రదించవలసిన నెంబర్లు 70756 67465, 99490 29440,