calender_icon.png 4 July, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అరవింద్‌ని ప్రశ్నించిన ఈడీ

04-07-2025 02:31:13 PM

హైదరాబాద్: సినీ నిర్మాత అల్లు అరవింద్ ను ఈడీ(Enforcement Directorate) అధికారులు ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ పై మానీలాండరింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్ సహా పలు చోట్లు ఈడీ సోదాలు చేసింది. రూ. 101.4 కోట్ల రుణ నిధులను మళ్లించారని ఈడీ గుర్తించింది. ఆయా సంస్థల డైరెక్టర్లపై బెంగళూరులో సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి, అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.