04-07-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జులై 3 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో నిరుపేదలు మరణిస్తే వారికి దహన సంస్కార సేవలు మున్సిపాలిటీ ద్వారా ఉచితంగా అందించాలని భారత సురక్షా సమితి సభ్యులు ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్’ను కోరారు. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అం దజేశారు.
సానుకూలంగా స్పందించిన ఎ మ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నిరుపేదలకు ఉచిత ద హన సంస్కార సేవలందించేలా చర్యలు తీ సుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీ ఎస్ రాజు, నాయకులు అక్కినపల్లి కాశీనాథ్, సింగం గంగాధర్, బాసెట్టి ప్రభాకర్, వెంకట్ రాజం, మల్లికార్జున్ తదితరులుపాల్గొన్నారు.