6 April, 2026 | 2:48 AM

కొత్త ఉత్సాహం!

06-04-2026 01:01 AM

ఓ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో హీరోయిన్ కాజల్ చౌదరి ఇలా సంప్రదాయ వస్త్రధారణలో హొయలుపోయింది. పట్టు పరికిణీలో జిగేల్‌మంటూ మెరిపోతూ, చిరునవ్వులు చిందిస్తూ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నట్టూ, ఈ నూతన చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మేనని అభిజ్ఞ వర్గాల భోగట్టా! అల్లరి నరేశ్ హీరోగా ఈ సినిమా రాబోతోందట. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారని వినికిడి.

బీవీఎస్ రవి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. డివోషనల్ టచ్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. హైదరాబాద్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కాగా.. సురేఖ కొణిదెల, స్వప్నదత్, విద్య కొప్పినీడి, జాహ్నవి నారంగ్, సుప్రియ యార్లగడ్డ వంటి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మహిళలు హాజరయ్యారని సమాచారం. చాలా రోజుల తర్వాత కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేయడమే కాజల్ చౌదరిలో కొత్త ఉత్సాహానికి కారణమని ఈ తస్వీర్ చూస్తే తెలుస్తోంది కదూ!!