6 July, 2026 | 2:57 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రమిది

29-05-2025 12:00 AM

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజాచిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జే రామాంజనేయులు సమర్పిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా పరిచయం అవుతున్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీష్మిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా జూన్ 27న విడుదల కానుండగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లియో జాన్ పాల్, రామాంజనేయులు, అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా, భాష్యశ్రీ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.