28 August, 2026 | 4:29 AM

హైదరాబాద్‌లో హాయ్ లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన

28-08-2026 12:23 AM

రేపటి నుంచి 31 వరకు లగ్జరీ వెడ్డింగ్ షాపింగ్ హబ్

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): భాగ్యనగర పెళ్లికూతుళ్లు, ఫ్యాషన్ ప్రియుల(Fashion lovers) కోసం సరికొత్త వెడ్డింగ్ ట్రెండ్స్‌(Wedding Trends)తో ‘హాయ్ లైఫ్ బ్రైడ్స్’(Hi-Life Brides) సరికొత్త లగ్జరీ షాపింగ్ ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమైంది. భారత దేశపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్రైడల్, ఫ్యాషన్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఈ ప్రదర్శన, ఈ నెల 29, 30, 31 తేదీల్లో మాదాపూర్‌లో ని నోవోటెల్ హెచ్‌ఐసీసీ వేదికగా వైభవంగా జరగనుంది.

ఈ మూడు రోజుల మెగా ఈ వెంట్‌లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టాప్ డిజైనర్లు రూపొందించిన ప్రత్యేక శ్రేణి కలెక్షన్లను ప్రదర్శించనున్నారు. పెళ్లికూతురి వ స్త్రాలంకరణను సరికొత్తగా ఆవిష్కరించే బ్రైడ ల్ కాస్ట్యూమ్స్, హెవీ లెహంగాలు, డిజైనర్ శారీస్, అత్యంత ఖరీదైన,వినూత్న శైలి కలిగిన ఫైన్ జ్యువెలరీ (నగలు), వెడ్డింగ్ ట్రూ సో, స్టేట్‌మెంట్ యాక్సెసరీలు ఇక్కడ ఒకే ఛత్రం కింద లభించనున్నాయి.

పెళ్లి వేడుకలోని ప్రతి సందర్భానికి (సంగీత్, మెహందీ, రిసెప్షన్) సరిపోయేలా సరికొత్త హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన వస్త్రాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భారతీ య సాంప్రదాయ ఫ్యాషన్, ఆధునిక లగ్జరీల అద్భుత కలయికతో, పెళ్లి షాపింగ్‌ను ఒక మధురమైన అనుభూతిగా మార్చడానికి ‘హాయ్ లైఫ్ బ్రైడ్స్’ ఈ ప్రత్యేక వేదికను అం దిస్తోంది. వివాహ వేడుకలను మరింత రాయల్‌గా, ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలనుకునే వారు, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వారు   ఈ అద్భుత ప్రదర్శనను సందర్శించాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.