28 August, 2026 | 2:41 AM

వైరల్ జ్వరాలు, ఫ్లూపై అప్రమత్తత అవసరం

28-08-2026 12:21 AM

కామినేని హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): హైదరాబాద్‌లో కొనసాగుతున్న వర్షాలు, అధిక తేమ కారణంగా వైరల్ జ్వరాలు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు, ఇతర తీవ్రమైన జ్వరాలతో కామినేని హాస్పిటల్స్(Kamineni Hospitals) ఎల్బీ నగర్, కింగ్ కోటి ఆసుపత్రుల్లోని ఓపీ విభాగాలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు తె లిపారు. జ్వరం వచ్చిన వెంటనే సొంతంగా మందులు వాడకుండా, 72 గంటలకు మిం చి జ్వరం కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని కామినేని హా స్పిటల్స్ సీనియర్ వైద్యులు సూచించారు.

స్థానికంగా డెంగ్యూ పరిస్థితి గత రెండేళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. కామినేని హాస్పిటల్స్, జనరల్ మెడిసిన్ విభాగం హెచ్‌ఓడీ, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎం. స్వామి మాట్లాడుతూ  సీజనల్ వైరల్ జ్వరాలు, హెచ్1ఎన్1 ఫ్లూ, డెంగ్యూ ప్రారంభ దశలో మొదటి 48 గంటల్లో దాదాపు ఒకే విధమైన లక్షణాలు కనిపించవచ్చు.

డెంగ్యూ తరహా లక్షణాలతో వచ్చే అనేక మంది రోగుల్లో పరీక్షలు నెగెటివ్గా వస్తుండగా, వారు తీవ్రమైన వైరల్ ఇ న్ఫెక్షన్లతో బాధపడుతున్న సందర్భాలు ఉ న్నాయి. జ్వరం మూడు రోజులకు మించి కొనసాగితే దానంతట అదే తగ్గిపోతుందని భావించకుండా, అదే రోజు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఓవర్-ది- కౌంటర్ మందులతో సొంత వైద్యం చేయకూడదు అని సూ చించారు.

సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ హరి కిషన్ మాట్లాడుతూ, వైరల్ జ్వ రాలకు సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. ఈ ఏడాది దేశంలో హెచ్1ఎన్1 కారణంగా 178 మరణాలు నమోదైన నేపథ్యం లో, వర్షాకాలం అనంతరం మరో సీజనల్ ఫ్లూ పీక్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నా రు. ముఖ్యంగా అధిక ప్రమాదానికి గురయ్యే వర్గాలకు వార్షిక ఇన్ఫు్లయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం ఒక ముఖ్యమైన నివారణ చర్య గా ఉంటుందని తెలిపారు.

కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు చిన్నారులు, వృ ద్ధులు, గర్భిణులు, మధుమేహం, గుండె సం బంధిత వ్యాధులు లేదా రోగనిరోధక శక్తి తగ్గిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నా రు. రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది, పదేపదే వాంతులు, మూత్రం తగ్గ డం, తీవ్రమైన నీరసం, మగత లేదా అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సకాలంలో వైద్య చికి త్స అందించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు అని అన్నారు.

అధిక ప్రమాదానికి గురయ్యే వర్గాలకు చెందిన రో గులను మరింత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ముఖ్యంగా డెంగ్యూలో జ్వరం తగ్గుముఖం పట్టే 3 నుంచి 7వ రోజు వరకు సమయం కీ లకం. జ్వరం తగ్గుతోందని పరిస్థితి మెరుగుపడుతోందని భావించకూడదు. తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, రక్తస్రా వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూ త్రం తగ్గడం, మగత లేదా అయోమయం ఉంటే వెంటనే ఆసుపత్రిని ఆశ్రయించాలి. ఫ్లూ విషయంలో శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది, ఛాతీ నొప్పి, పెదవులు నీలిరంగులోకి మారడం లేదా అయోమయం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు అని కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పటేల్ తెలిపారు.