మే 2న హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్
- 6వ ఎడిషన్‌కు నామినేషన్లు ప్రారంభం
- రూ.2.5 లక్షల స్కాలర్‌షిప్స్ అందజేత
- నామినేషన్ల దాఖలుకు చివరితేది ఏప్రిల్ 26న
హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 6వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఈ అవార్డ్స్ కార్యక్రమం ఈ సంవత్సరం మే 2న హైదరాబాద్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేయనున్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవా ర్డులు ప్రదానం చేయనున్నారు.మొత్తం 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా, హైబిజ్ టీవీ, లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మీడియా కుటుంబాల విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరికి రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.2.5 లక్షల విలువైన 10 స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్య మని సంస్థ తెలిపింది.అర్హులైన అభ్యర్థులు త మ వివరాలను ceo@hybiz.tv మెయి ల్కు లేదా 8096974747 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 26గా నిర్ణయించారు.నలుగురు లెజెండ్లకు ఈ సారి లెజెండరీ పుర స్కారాలను అందజేయనున్నారు.
అందులో సీనియర్ జర్నలిస్ట్ బి. శ్రీనివాస్ రావు,టైమ్స్ ఆఫ్ ఇండియా సుసీల్‌రావు, ఈనాడు/హిం దూలో పని చేసిన శ్రీనాథ్ అయ్యర్ అండ్ ఢిల్లీ దూరదర్శన్ నుండి మృణాళిని ఎంపికయ్యారు. మరిన్ని వివరాలకు www.hybiz.tv లేదా 9666796622కి కాల్ చేయండి.






