22 April, 2026 | 1:47 AM

చరిత్ర సృష్టించిన నారాయణ

22-04-2026 12:14 AM
  1. జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో
  2. ఆలిండియా టాప్ ర్యాంక్
  3. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్‌గా సంచలనం

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): నేడు ప్రకటించిన జేఈఈ-మెయిన్ 2026 ఫలితాలలో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 10, 14, 17, 19, 21, 23, 24, 25 వంటి 10లోపు 1, 25లోపు 8, 100లోపు 24 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు.

ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25, 27, 29, 32,37, 40, 40, 44, 56, 61, 64, 66, 73, 74, 76, 97 వంటి 100 లోపు 24టాప్ ర్యాంకులతో పాటు 1000లోపు 160 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించినట్లు తెలిపారు. వీరిలో అత్యధికులు నారాయణ స్కూల్ విద్యార్థులే కావ టం గమనార్హమన్నారు. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 1, 6, 7, 9, 10 వంటి 10లోపు 6 ర్యాంకులతో పాటు ఇప్పటి వర కు అందిన సమాచారం మేరకు 100లోపు 48 ర్యాంకులు, 1000లోపు 750 ర్యాం కులు కైవసం చేసుకున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమా నారాయణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరీ లో 3 సార్లు(2020, 2021, 2025) ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడటం నారాయ ణ కమిట్‌మెంట్‌కు ఈ రికార్డులే నిదర్శనమన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 100 పర్సం టైల్ సాధించిన వారు 26 మంది ఉండగా, వారిలో 7మంది(27%) నారాయణ విద్యార్థులు కావటం గమనించదగ్గ విషయం అన్నారు.

అలాగే 8 రాష్ట్రాల్లో నారాయణ విద్యార్థులే టాపర్స్‌గా నిలిచారన్నారు. ఆలిండియా బాలికల విభాగంలోనూ నారాయణ విద్యార్థిని మల్లవరపు అస్నా(హెచ్‌టీ నెం. 260310443636) ఫస్ట్ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ మా ట్లాడుతూ జేఈఈ మెయిన్ కలలను సాకా రం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, పోటీరారని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సుమా రు 14.75లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయగా, వీరిల సామాజిక వర్గాల వారీగా, రిజర్వేషన్లకు అనుగణంగా కేవలం 2.50 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత కల్పిస్తారని తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలలో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు. నారాయణ అందించే అనితరసాధ్య మైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లు, పటిష్ట ప్రణాళిక, స్టడీ మేటీరియల్, నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షల వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

ఆన్‌లైన్ ఎగ్జా మ్స్ కోసం ప్రత్యేకంగా ఎన్-లెర్న్ యాప్‌ను రూపొందించటం జరిగిందన్నారు. దీనిద్వారానే ప్రాక్టీస్, అనాలసిస్ జరుగుతోంద న్నారు. వీటికోసం ప్రతి క్యాంపస్‌లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. మరో డైరెక్టర్ శరణి నారామణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో(తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్) నారాయణ విద్యార్థులే టాపర్స్‌గా నిలవటం నా రాయణ ఘనతకు నిదర్శనంగా పేర్కొన్నా రు.

అలాగే ఓపెన్ కేటగిరీలో 1000 లోపు ర్యాంకుల్లో 165కి పైగా ఉంటారని, అంటే దాదాపు 16% నారాయణ విద్యార్థులే కైవ శం చేసుకోవటం గమనార్హమన్నారు. ఇంత టి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు.

ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్ కోసం కేవలం నారాయణ విద్యా సంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు జేఈఈ-మెయిన్ నుంచి క్యాలిఫై కావటం గర్వంగా ఉందని వారు ప త్రికా ముఖంగా తెలిపారు. అందుకే ఐఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నారాయణే అని మరోసారి నిరూపించామన్నారు.