16 July, 2026 | 4:58 PM

ఎంఎల్ఎల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

03-07-2024 04:08 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి మారిన ఎంఎల్ఎలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీపామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలే యాదయ్యపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎంఎల్ఎలు వివేకానంద, కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు.