మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టులో షాక్
16-12-2024 01:23 PM
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. 2017లో కాళేశ్వరం వద్ద గలాటాపై శ్రీధర్ బాబుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన సెక్షన్లు కొట్టివేయాలని శ్రీధర్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేస్తూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. కింది కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావడాన్ని హైకోర్టు మినహాయించింది.






