రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలి: ఎమ్మెల్సీ కవిత
16-12-2024 01:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు వారం రోజుల తర్వాత సోమవారం నాడు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని తెలిపారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, బెంగళూరు నుంచి పట్టు దిగుమతి చేసి చేనేతలకు అదనపు భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే పట్టుగూళ్ల బకాయిలు రూ.8 కోట్లు విడుదల చేయాలని కవిత పేర్కొన్నారు.






