కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు
విచారణ వీడియోలు పోస్ట్ చేయడంపై ఆగ్రహం
ఢిల్లీ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు ధిక్కరణ చర్యల కింద నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంతశర్మ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తక్షణమే ఆ వీడియోలను తొలగించాలని స్పష్టం చేసింది.
కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీడియోలు రికార్డ్ చేశారని, దీనిపై విచారణ జరపాలని న్యాయవాది వైభవ్ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆప్ నేతలు వ్యవహరించారని వాదించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌తోపాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.






