24 April, 2026 | 1:49 AM

అమెరికా వీడుదామంటున్న భారతీయులు!

24-04-2026 12:23 AM
  1. 40 శాతంమంది ఆలోచన ఇదే
  2. ట్రంప్ పరిపాలనపై 71 శాతంమంది అసంతృప్తి
  3. అమెరికా జనాభాలో 1.5 శాతంమంది ఇండియన్స్

న్యూయార్క్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భారతీయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నా రు. ‘కార్నెగీ ఎండోమెంట్’ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది భారతీయులు శాశ్వతంగా అమెరికాను వీడాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టమైంది. ప్రతీ వందమందిలో 40 శాతం మంది భారతీయ అమెరికన్లు రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నందువల్ల తిరిగి భారత్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సర్వేలో తేలింది. అక్కడి జీవన విధానాలు, ట్రంప్ ప్రభుత్వ పనితీరు, రాజకీయ అస్థిరత వల్లే తాము అమెరికాను వీడాలని అనుకుంటున్నామని 58 శాతం భావిస్తున్నారు.

జీవన వ్యయంపై 54, వ్యక్తిగత భద్రతపై 41 శాతం మంది తమ ఆందోళనలను వ్యక్తపరిచారు. ట్రంప్ పరిపాలనపై 71 శాతం మంది ఇండియన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అమెరికాను వీడేందుకు ఆర్థిక ఒత్తిళ్లు కూడా మరో ప్రధాన అంశంగా సర్వేలో వెల్లడైంది. పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ భద్రత, పిల్లల చదువులు, పెంపకం ఖర్చు, ఇంటి అద్దెలు తదితరా లపై కూడా భారతీయ భవిష్యత్ గురించి ఆలోచించేందుకు మరో కారణంగా నిలిచింది. అగ్రరాజ్యంలో 2024 లెక్కల ప్రకారం 54 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో 1.5 శాతం కావడం గమనార్హం.