మల్లారెడ్డి, పల్లాకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ వేసి న పిటిషన్‌ను విచారించిన హైకో ర్టు.. వారిద్దరికీ నోటీసులు ఇచ్చింది. ఆ రెండు నియోజకవర్గాల్లోని ఈవీఎంలను వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నిక ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తోటకూర వజ్రేశ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ శ్రీనివాసరావు విచారించారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని పేర్కొన్నారని, కానీ రికార్డుల ప్రకా రం అది ప్రభుత్వానిదని పిటిషనర్ తెలిపారు.
హిందూ అవిభాజ్య కుటుంబ పెద్దగా ఉన్న మల్లారెడ్డి బ్యాంకు ఖాతాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఎలా దాఖలు చేశారో చెప్పలేదన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి విచారించారు. ఈ రెండు వ్యాజ్యాల్లో పిటిషనర్లు సమర్పించిన ఆధారాలతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. విచారణను జూన్ 16కి వాయిదా వేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూంల్లోని ఈవీఎంలను పార్లమెంట్ ఎన్నికలకు వాడుకునేందు కు అనుమతి ఇవ్వాలంటూ ఈసీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను అనుమతించారు.




