జూన్ 5న పీసీబీ ప్రతిభా పురస్కారాలు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): జూన్ 5న ప్రపంచ పర్యా వరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ప్రతిభా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్ష ణ, కాలుష్య నియంత్రణ, ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ నిషే ధం, నీటి పొదుపు, వాయు కాలు ష్య నియంత్రణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగాలలో కృషి చేస్తు న్న సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, స్థానిక సంస్థలకు ఈ అవా ర్డులను ప్రదానం చేయనన్నట్లు పేర్కొంది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు తమ దరఖాస్తులను పర్యావరణ విభాగం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఇండస్ట్రీయ ల్ ఎస్టేట్, పర్యావరణ భవన్, సనత్‌నగర్ అనే చిరునామాకు పంపిం చాలని తెలిపింది. మరిన్ని వివరాలకు సీనియర్ సైంటిస్టు జీ ప్రసన్న కుమార్ (ఫోన్ నెంబరు 98499 08831), సీనియర్ ప్రాజెక్టు అధికారి బీ నాగేశ్వరరావు (ఫోన్ నెంబరు 91773 03127)లను సంప్రదించాలని సూచించింది.




