2 May, 2026 | 4:08 AM

పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా

02-05-2026 02:52 AM

సీఎం భగవంత్ మద్యం తాగి సభకు వచ్చారని విపక్షాల ఆరోపణ

అధికార ‘ఆప్’, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం

బ్రీత్‌ఎన్‌లైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్

నిరాకరించిన స్పీకర్.. విపక్ష సభ్యుల వాకౌట్

చండీగఢ్, మే ౧: పంజాబ్ రాజధాని చండీగఢ్‌లోని అసెంబ్లీలో శుక్రవారం హై డ్రామా జరిగింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం తాగి చట్టసభకు వచ్చారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఈ విషయం లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో సభలో తోపులాట జరి గింది. సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ తక్షణం బ్రీత్‌ఎనలైజర్, డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని స్పీకర్‌ను విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పలికారు.

ఉదయం సెషన్ మొత్తం సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ వారించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తిరిగి మధ్యా హ్నం సభ ప్రారంభమైన వెంటనే సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. సీఎం ప్రవర్తన గౌరవప్రదంగా లేదని, చట్టసభకు మద్యం తాగి రావడం సభకే అవ మానకరమని వ్యాఖ్యానించారు. విపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి అమన్ అరోరా మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశా రు. అయినప్పటికీ, స్పీకర్ మాత్రం విపక్షాలు కోరిన డోప్ పరీక్షల ససేమీరా అన్నారు.