ఈయూ కార్లపై 25% సుంకం
02-05-2026 02:42 AM
ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం
వాషింగ్టన్, మే ౧: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల కార్లు, ట్రక్కులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించారు.
గతంలో తమ దేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో ఈయూ అమలు చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్ ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. యూరప్ దిగుమతులను నియంత్రించాలని అమెరికా భావిస్తున్నదని ఆయా దేశాల ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. తమ వాహన తయారీ కంపెనీల తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి






