23-08-2025 12:00:00 AM
- శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మూసాపేట్ ఆగష్టు 22 : మండలం జానంపేట జాతీయ రహదారి 44 నుండి తాళ్లగడ్డ గ్రామానికి వెళ్లే రహదారిపై 1 కోటి 25 లక్షల నిధులతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి నీ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40సంవత్సరాల నుంచి తాళ్లగడ్డ గ్రామస్తుల చాలా కష్టాలు పడ్డారని, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు తాళ్లగడ్డ గ్రామస్తుల దారి కష్టాలు పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చినా వెంటనే ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చేల పని చేస్తుందన్నారు. ప్రతి పనిలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్న తక్షణమే సమాచారం అందించాలని ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు బోయ రవికుమార్, నక్క లక్ష్మణ్, రామన్ గౌడ్, తిరుపతయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.