22-08-2025 11:49:15 PM
అలంపూర్ ఆగస్టు 22: తాము సాగు చేసిన పంటలకు సకాలంలో యూరియా దొరకక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని గత్యంతరం లేక పక్క రాష్ట్రానికి వెళ్లి యూరియాను తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు శుక్రవారం రాజోలి మండల కేంద్రంలోని ఏఈఓ బిందుకు కెవిపిఎస్, సిపిఐ నాయకులు రైతులతో కలిసి వినతి పత్రాన్ని అం దజేశారు.దాదాపు 100 నుంచి 150 టన్నుల వరకు యూరియా అవసరమందని రైతులు తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని విజ్ఞ ప్తి చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు బెంజిమెన్, భాస్కర్ ,చిన్నబడసాబ్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.