calender_icon.png 23 August, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

23-08-2025 12:00:00 AM

  1. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

12 మండలాల పరిధిలో 260 గ్రామాలలో ఒకేరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ

ఇందిరా మహిళా శక్తి కింద ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి

ముస్తాబాద్,ఆగస్టు 22:(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనుల జాతర 2025 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతా ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝ తెలిపారు.శుక్రవారం పనుల జాతరలో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో (క్యాటల్ షెడ్) పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేశా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిష న్, ఉపాధి హామీ పథకం, పంచాయతీ రా జ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా చేపట్టబోయే కొత్త పనులను మన జిల్లాలో ప్రారంభించడానికి పనుల జాతర 2025 అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభు త్వం అమలు చేస్తుందన్నారు. 

జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని 260 గ్రామాలలో పనుల జాతర-2025 కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం, ఆర్. డబ్ల్యూ.యస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాలలో చే పట్టనున్న పనులకు ఈ సందర్భంగా భూమి పూజలు చేస్తున్నామని పేర్కొన్నారు.నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు,

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా క్రింద వ్యక్తిగత ఆస్తుల కల్ప న పనులు అనగా పశువుల కొట్టం, కోళ్ళ షెడ్, గొర్రెల షెడ్, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోలా పిట్ నిర్మాణం, జలనిధి క్రింద వాన నీటి సంరక్షణ-భూగర్భ జలాలు పెంచే ఫారమ్ పాండ్స్, ఊట కుంటలు వంటి పనులకు ఈ కార్యక్రమం ద్వారా చేపడుతున్నామని తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని పిలుపునిచ్చారు.ఇం దిరా మహిళా కింద ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం గ్రామైక్య మహిళా సంఘం వారిచే ఏర్పాటు చేసిన నూతన ఎరువుల దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరరై రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు.

త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.జిల్లా లో మొత్తం 23 దుకాణాలు మహిళా సం ఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దు కాణాలు ప్రారంభించామని వివరించారు. మహిళలు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రై తులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు ఎరువులు విత్తనా లు, పురుగు మందులు కొనుగోలు చేసి మ హిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు.

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభు త్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రణాళిక ప్రకా రం వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం ముస్తాబాద్ మండలం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి మహిళా సంఘాల సభ్యులు రైతులు ప్రజలు స్థానిక నాయకు లు కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు బాల్ రెడ్డి,రాజు నాయకులు తదితరు లు పాల్గొన్నారు.