19 August, 2026 | 1:02 AM

లాఠీచార్జిపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

19-08-2026 12:00 AM

కమిటీలో విశ్రాంత జడ్జీలు, విశ్రాంత సీబీఐ డైరెక్టర్లు

ఒక మాజీ డీజీపీ కూడా: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౮: న్యూఢిల్లీలో విద్యార్థుల ర్యాలీపై పోలీస్‌చర్య (లాఠీచార్జీ)పై విచారణకు ఒక ఉన్నత స్థాయి (హైవపర్) కమిటీ ని ఏర్పాటు చేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులు, విశ్రాంతి సీబీఐ డైరెక్టర్లు, ఒక మాజీ డీజీపీ ఉంటారని స్పష్టం చేసింది.

ప్యానెల్‌లో చేర్చాల్సిన ఇతర సభ్యుల విషయంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు స్వీకరిస్తామని, దీనిపైనా బుధవారంఒక కమిటీ ఏర్పాటు వెల్లడించింది. గత నెల ౨౦న విద్యార్థులు, సీజేపీ నేతలు ఢిల్లీలో చేపట్టిన శాంతియుత ప్రదర్శనపై పోలీస్ చర్య, లాఠీచార్జీ, పెల్లెట్ గన్స్ వినియోగంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

విద్యార్థులు నిరసన తెలుపుతున్నారన్న కారణంతో లాఠీచార్జి చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు దేశంలో ఏ పౌరుడికైనా ఉంటుందని నొక్కిచెప్పింది. తాము నియమించిన హైపవర్ కమిటీకి హింసాకాండకు సంబంధించిన వీడియో ఫుటేజీ, సీసీ టీవీ రికార్డులను అందజేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మహిళా ఆందోళనకారులపై హింసపైనా కమిటీ పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.

విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం కోర్టు తన ప్రత్యేక అధికారాలను వినియోగించుకునే అవకాశం ఉందని సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలో సొలసిటర్ జనరల్ తన వాదన వినిపిస్తూ.. 2,800 మందికి పైగా ఆందోళనకారుల్లో గతంలో నేరపూరిత పూరిత కేసులు ధాఖలయ్యాయని విన్నవించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నేరపూరిత కేసుల చరిత్ర ఉన్న వారిపై మినహా మిగిలిన ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు తీసేయొచ్చని స్పష్టం చేసింది.