19 August, 2026 | 2:58 AM

ట్రంప్ పనితీరు బేజారు

19-08-2026 12:00 AM

అగ్రరాజ్యాధినేత పాలనకు 33 శాతమే ఆమోదం

రాయిటర్స్ సర్వేలో సంచలన వాస్తవాలు

వాషింగ్టన్, ఆగస్టు 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరుకు మద్దతు భారీగా దిగజారింది. 33 శాతం మాత్రమే ఆమోదం తెలిపినట్లు రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో తేలింది. 64 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారని ఈ సర్వే నాలుగు రోజుల పాటు కొనసాగి ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతను సర్వే సంస్థ బహిర్గతం చేసింది.

2017 డిసెంబర్‌లో ట్రంప్‌కు ఆమోద రేటు 35 శాతం నమోదైంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంతో ట్రంప్ ప్రజాదరణ ఘోరంగా దెబ్బతిందని సర్వేలో పేర్కొన్నారు. అమెరికా  ఇరాన్ యుద్ధం సుధీర్ఘం కొనసాగుతుందని 80 శాతం మంది అమెరికన్లు, 87 శాతం మంది డెమోక్రాట్లు, 71 శాతం మంది రిపబ్లికన్లు భావించగా, 16 శాతం మంది మాత్రమే కొన్నిరోజుల్లో ముగుస్తుందన్నారు.