16 April, 2026 | 10:09 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

‘రైతుకు వందనం’ అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి

02-03-2026 12:28 AM

చిట్యాల, మార్చి 1 : సాయి అలేఖ్య ఆరట్స్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రైతు పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి కి రైతుకు వందనం అవార్డు వరించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన రైతు పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సాయి అలేఖ్య ఆరట్స్ మరియు బిగ్ టీవీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన  చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రైతుకు వందనం అవార్డు స్వీకరించారు.

సమీకృత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులను పొందుతూ, రైతులకు ఆదర్శంగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి  గతంలో తెలంగాణ రాష్ట్ర బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు, బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డు మరియు రాష్ట్ర రైతు రత్న అవార్డులు పొందగా, ప్రస్తుతం రైతుకు వందనం అవార్డు రావడం పట్ల రైతు పజూరి అజయ్ కుమార్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రోత్సహక అవార్డులను ఏర్పాటు చేసి రైతులకు గుర్తింపుని, గౌరవాన్ని ఇస్తున్న నిర్వహణ సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.