calender_icon.png 28 November, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టుకు పాదయాత్ర

28-11-2025 08:00:25 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్  మంచిర్యాల నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టుకు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో జగన్ ను లక్షెట్టిపేట కోర్టు న్యాయవాదులు స్వాగతించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా కేంద్రంలో కోర్టుకు శాశ్వత బిల్డింగ్ నిర్మాణం జరిగితే తాను కొండగట్టు అంజన్న స్వామికి మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కలను తీర్చడానికి ఈ పాదయాత్ర ప్రారంభించానన్నారు. జగన్ ను సన్మానించిన వారిలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు వొజ్జల నళిని కాంత్, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గోవిందరావు, వ్యాపారస్తులు పల్లెర్ల శ్రీనివాస్, దయాసాగర్ తదితరులున్నారు.