రేపు అసోం సీఎంగా హిమంత ప్రమాణం?
గవర్నర్ లక్ష్మణ్ ఆదేశాల మేరకు సన్నాహాలు
దిస్పూర్, మే ౫: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ఈనెల 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఆయనతో పాటు నూతన మంత్రివర్గం కూడా అదే రోజు బాధ్యతలు స్వీకరించనుందని తెలిసింది. రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండ గా, బీజేపీ సింగిల్‌గానే 82 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆదేశాల మేరకు సన్నాహాలు సాగుతున్నాయి. మిత్రపక్షాలైన ఏజీపీ వంటి పార్టీలకు కూడా ఎన్డీయే తన మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తున్నది. దీనిలో భాగంగానే హిమంత బిశ్వశర్మ మంగళవారం గౌహతిలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, మిత్రపక్షాలతో భేటీ అయ్యారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.






