9 July, 2026 | 1:14 PM

హింద్ జింక్ భారీ డివిడెండు

11-05-2024 01:05 AM

ముంబై, మే 10: షేర్‌హోల్డర్లకు తరచూ డివిడెండ్లను పంచుతున్న మెటల్ కంపెనీ హిందుస్థాన్ జింక్ తాజాగా మరో భారీ డివిడెండును ప్రకటించింది. రూ. 2 ముఖవిలువగల షేరుపై రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లింపునకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సుచేసింది. తాజా డివిడెండుతో ఇన్వెస్టర్ల కు కంపెనీ రూ.4,225 కోట్లు పంచుతుంది. ముగిసిన ఆర్థిక సంవత్స రంలో హింద్ జింక్ షేరుకు మొత్తం రూ.75.5 చొప్పున డివిడెండు ప్రకటించగా, ఇందుకోసం రూ.31,901 కోట్లు కేటాయించింది. తాజా డివిడెండు ప్రకటనతో హింద్ జింక్ షేరు శుక్రవారం 11 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.530 వద్దకు చేరింది. హింద్ జింక్‌లో 64.92 శాతం వాటా ఉన్న వేదాంత రిసోర్సెస్‌కు డివిడెండు రూపంలో రూ. 2,743 కోట్లు, 29.5 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,247 కోట్ల డివిడెండును ఈ మెటల్ కంపెనీ చెల్లిస్తుంది. క్యూ4లో హింద్ జింక్ నికరలాభం 21 శాతం క్షీణించి రూ.2,589 కోట్ల నుంచి రూ.2,042 కోట్లకు తగ్గింది. ఆదాయం 11 శాతం తగ్గి రూ.8,509 కోట్ల నుంచి రూ. 7,550 కోట్లకు చేరింది. జింక్, లెడ్ ధరలు తగ్గినందున ఆదాయ, లాభా లు క్షీణించినట్టు కంపెనీ తెలిపింది.