calender_icon.png 8 July, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందాల్కో నికరలాభం రూ.3,074 కోట్లు

14-08-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ హిందాల్కో ఇండస్ట్రీస్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 25 శాతం వృద్ధిచెంది రూ.3,074 కోట్లకు పెరిగింది. ముడి వ్యయాలు తగ్గడం, నిర్వహణా సామర్థ్యాలు పెరగడం లాభాల వృద్ధికి కారణమని హిందాల్కో తెలిపింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.2,454 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.53,382 కోట్ల నుంచి రూ. 57,437 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.6,109 కోట్ల నుంచి రూ.7,992 కోట్లకు చేరింది. తమ కాపర్, అల్యూమినియం ఇబిటాలు పటిష్టంగా పెరిగినట్టు కంపెనీ తెలిపింది.