calender_icon.png 9 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎండీసీ లాభం 18% అప్

14-08-2024 12:05:00 AM

హైదరాబాద్, ఆగస్టు 13: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన క్యూ1లో 18 శాతం వృద్ధిచెంది రూ.1,963 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.1,661 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిస్తున్న ఎన్‌ఎండీసీ మొత్తం ఆదాయం రూ. 5,689 కోట్ల నుంచి రూ. 5,779 కోట్లకు పెరిగింది. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.