calender_icon.png 8 July, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరో మోటో లాభం రూ.1,032 కోట్లు

14-08-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ నికరలాభం ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో 47 శాతం వృద్ధిచెంది రూ.1,032 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.701 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.8,851 కోట్ల నుంచి రూ. 10,211 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో హీరో మోటో స్కూటర్లు, మోటారుసైకిళ్ల విక్రయాలు 13.53 లక్షల యూనిట్ల నుంచి 15.35 లక్షల యూనిట్లకు పెరిగాయి. తొలిసారిగా ఒకే త్రైమాసికంలో తమ అమ్మకాలు రూ.10,000 కోట్లను దాటాయని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు.