బోధన్ పట్టణంలో నేడు హిందూ సమ్మేళనం
23-05-2026 02:08 AM
బోధన్, మే 22(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని బురుడు గల్లిలో గల విష్ణు మందిరం వద్ద నేడు సాయంత్రం 5:30 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పాల్గొంటారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






