calender_icon.png 23 December, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

23-12-2025 01:56:42 PM

హిందూ వ్యతిరేక శక్తుల్లారా ఖబర్దార్ 

నారాయణపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన 

బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం 

నారాయణపేట,(విజయక్రాంతి): ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad), బజరంగ్దళ్ నాయకులు హెచ్చరించారు.  బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు దీప్ దాస్ ను కొంతమంది అకారణంగా హత్య చేసి కిరాతకతంగా లాక్కెళ్ళి చెట్టుకి వేలాడదీసి నిప్పంటించి న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత  విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు జిల్లా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో (జస్టిస్ ఫర్ బంగ్లాదేశ్ హిందూస్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మెయిన్ చౌక్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి. సత్యనారాయణ చౌరస్తాలో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందువుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను పరిగణలోకి తీసుకొని హిందువులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారుఈకార్యక్రమంలో సత్య యాదవ్, సురేఖ రాంబాబు, ఉమాదేవి, కడేచుర్ రజిత,  డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, స్వాతి, కన్న శివకుమార్, భీమ్ చంద ర్ గౌడ్, మురళి భట్టడ్, మనోహర్ ప్రసాద్ గౌడ్,  గందె చంద్రకాంత్, శిరీష చెన్నారెడ్డి, పోషల్ వినోద్, సత్య రఘుపాల్, ప్రవీణ్ , కాకర్ల భీమయ్య, మిర్చి వెంకటయ్య, చంద్రశేఖర్, పోషల్ సంతోష్, సంపంగి కృష్ణ, రఘువీర్ యాదవ్, చంద్రశేఖర్, శ్రావణ్, చరణ్ రెడ్డి, నరేష్, బొంబాయి బాలాజీ, ఆకాష్, అన్వేష్  తదితరులు పాల్గొన్నారు.