calender_icon.png 23 December, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

23-12-2025 01:59:40 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై(Ramachandrapuram National Highway) జరిగిన రోడ్డు ప్రమాదంలో నాసర్ చెన్న కేశవులు (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పల్సర్ బైక్‌పై రామచంద్రాపురం నుంచి చందానగర్‌కు డ్యూటీకి వెళ్తుండగా, వెనక నుంచి మరో బైక్ ఢీకొనడంతో రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనక టైర్ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాద స్థలంలోనే చెన్న కేశవులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన చెన్న కేశవులు రెండు నెలల క్రితం చందానగర్‌లోని పీఆర్‌కే ఆస్పత్రిలో ప్లంబర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సెటిల్ అయిన తర్వాత నెల రోజుల్లో భార్య, పిల్లలను తీసుకువచ్చే ఆలోచనలో ఉండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతునికి భార్య అంజలి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.