16 March, 2026 | 5:22 AM

సంగీతం సాహిత్యంలో కృషి అపూర్వం

16-03-2026 01:21 AM

ముషీరాబాద్, మార్చి 15(విజయక్రాంతి): సంగీతం సాహిత్యం లో కృషి చేస్తు న్న వారిని గుర్తించి పురస్కారాలు అందించడం అపూర్వమైన కార్యక్రమమని తెలం గాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో సాహిత్యం సంగీతం రంగాలలో ఉత్తమ సేవలందించిన ముగ్గురికి పురస్కారాలను అబి డ్స్‌లో గల తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమం లో అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమణా చారి మాట్లాడు తూ వరప్రసాద్‌రెడ్డి సారథ్యంలోని ట్రస్టు సాహితీవేత్తలను గుర్తించి నగదు పురస్కారాలు అందించి ప్రోత్సహించడం మంచి సాంప్రదాయం అన్నారు. సాహితివేత్తలకు ఈరోజు ఉగాది పండుగ లాంటిదని పేర్కొన్నారు. సుధామ గొప్ప సృజన కారులని, ఆలోచింపజేసే సాహిత్యాన్ని ప్రభాకర్ రెడ్డి సృష్టించారని ఆయన వివరించారు. టీటీడీలు ఆస్థాన విధ్వంసులుగా మోహన కృష్ణ కు పదవి దక్కాలని రమణాచారి ఆకాంక్షించారు. వరప్రసాద్ రెడ్డి ప్రసంగిస్తూ బహుముఖీన ప్రతిభావంతులకు కృతజ్ఞతాపూర్వక సన్మానాలు మాత్రమే తాను చేస్తున్నానన్నా రు.

సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పురస్కార గ్రహీతల ను సభకు పరిచయం చేశారు. పురస్కారం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డివి మోహ న్ కృష్ణ శిష్య బృందం మోహనరాగం శీర్షికతో నిర్వహించిన సంగీత కచేరి అహుతులను అలరించింది. ప్రముఖ సాహి తీ వేత్త చీకోలు సుందరయ్య రచించిన మన మహానుభావులు పుస్తకాన్ని వరప్రసాద్ రెడ్డి దంపతులు ఆవిష్కరించి అభినందనలు తెలిపారు. ట్రస్టు కార్యదర్శి తొడుపు నవీన్ సభను సమన్వయం చేశారు.

పురస్కార గ్రహీతలు వీరే..

డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డికి, కోడూరు వెంకట రమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారాన్ని సుధామకు, వసంత వరప్రసాద్ రెడ్డి సంగీతరత్న పురస్కారం ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వంసులు డివి మోహనకృష్ణకు అందజేశారు.