20 April, 2026 | 2:44 AM

కులగణనపై చారిత్రాత్మక సమావేశం

20-04-2026 12:13 AM

సామాజిక న్యాయం కోసం మేధావుల ఐక్యత

ముషీరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి):  సామాజిక విశ్లేషకుడు, భారతీయ రాజకీయ విశ్లేషణ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య నివాసంలో జాతీయ ఓబీసీ మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికలోని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఆళ్ల రామకృష్ణ, కంచ ఐలయ్య కుల గణన అంశంపై సమావేశం కావడం సామాజిక న్యాయం దిశగా ఒక ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. ఈ సమావేశంలో  ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఓబీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కు కులగణన అత్యవసరమని, దీనికి మేధావులు, యువత, సామాజిక సంస్థలు కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ప్రొఫెసర్ ఐలయ్య మాట్లాడుతూ కులగణన అనేది చారిత్రా త్మక అసమానతలను వెలుగులోకి తెచ్చే సాధనమని, ఐక్య పోరాటం ద్వారా మాత్రమే సమానత్వ సమాజం నిర్మించవచ్చని పేర్కొన్నారు.