‘తెలంగాణలో హిట్లర్ రాజ్యం’
21-06-2026 12:00 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో హిట్లర్ రాజ్యం నడుస్తోందని, హిట్లర్‌లా రేవంత్ వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శిం చారు. సింగరేణి కాలరీస్‌కు బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్తే పోలీసులు మోహరించి, లారీలు అడ్డం పెట్టి, అడ్డుకున్నారని మండిపడ్డారు. రేవంత్ ఇటీవల హిట్లర్ స్ఫూర్తి అన్నారని, ఇప్పుడు నిజం చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.






